Description
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులైనట్టి కృష్ణ కృహమూర్తి శ్రీ తీల ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు తమ గురుదేవుని ఆజ్ఞ మేరకు కృష్ణ భక్తిని పాశ్చాత్య దేశాలలో ప్రచారము చేయడానికి సంకల్పించినపుడు శ్రీల వ్యాసదేవునిచే రచించబడిన శ్రీమద్భాగవతమునే దివ్యసాధనముగా ఎంచుకున్నారు. భాగవతంలోని సద్దెనిమిది నేల శ్లోకాలకు ప్రతి పదార్థము, తాత్పర్యము, సమగ్రమైన భాష్యమును ఆంగ్లభాషలో రచించే బృహత్కార్యాన్ని చేపట్టి, సాధించి గుర్వాజ్ఞను ఆయన నెరవేర్చారు. ఆ సమగ్ర భాగవత వ్యాఖ్యానము ఇపుడు పద్దెనిమిది సంపుటాలలో తెలుగు భాషతో సహా అనేక ప్రపంచ భాషలలో లభిస్తున్నది.
న్యాస నిరచితమైన శ్రీమద్భాగవతములో నిక్షిప్తమైనట్టి అనేకమైన ఆధ్యాత్మిక రహస్యాలు శ్రీల ప్రభుపాదులవారి భక్తి వేదాంత భాష్యము ద్వారా వెల్లడి అయినాయి. మూల సంస్కృత భాగవతము ఒక రహస్యపురాణము. శ్రీల వ్యాసదేవుడు దానిని తన సరిపక్వావస్థలో రచించారు. అయితే తెలుగువారిలో వ్యాసభాగవతము విస్తృతంగా
ప్రచారం కాకపోవడం వలన దానిలోని ఎన్నో రహస్యాలు గుప్తంగా ఉండిపోయాయి. జనులకు తెలియకుండ రహస్యంగా ఉండిపోయిన విషయము “కృష్ణస్తు భగవాన్ స్వయం” అనేది. శ్రీకృష్ణుడు సకలావతారాలను ధరించినట్టి అవతారి అని తెలియజేయడమే శ్రీమద్భాగవత ఉద్దేశ్యము. పద్దెనిమిది సంపుటాల రూపంలో ఉన్నట్టి సమగ్రమైన భక్తివేదాంత భాష్యము ద్వారా తెలియబడే ఆ రహస్యాలను అతిత్వరగా తెలిసికొనే అవకాశము తెలుగు ప్రజలకు అందించాలనే ఈ భాగవత కథలు అనే పుస్తకాన్ని ప్రచురించడము జరిగింది. ఈ పుస్తకమును చదవడము ద్వారా వ్యాసభాగవత సారము మీకు నిశ్చయంగా అర్థమౌతుంది. దీనిని చదివిన తరువాత మరింత రసాస్వాదనకు, తత్త్వావగాహనకు పద్దెనిమిది సంపుటాల భక్తి వేదాంత భాష్యమును పాఠకులు చదవాలి. ఆ విధంగా నిరంతర భాగవత పఠనంలో మానవజన్మ సార్థకమౌతుంది.
Reviews
There are no reviews yet.